కాస్ట్ కౌచింగ్ అంతా దుష్పచ్రారమే: తెలుగు పరిశ్రమపై అనన్య నాగళ్ల
2 months ago | 5 Views
అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్ అనన్య నాగళ్ల త్వరలో 'పొట్టేల్' అనే రూరల్ పిరియాడిక్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ ప్రశ్నలు వేయగా నటి అనన్య కూడా అదే రేంజ్‌లో జవాబు ఇచ్చి ఔరా... అనిపించింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు.. అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది కదా విూకు
ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఓ మహిళా విలేకరి అనన్య కు ప్రశ్న వేసింది. దానికి ఆమె విూరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారని జవాబిచ్చింది. విూరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని మరో క్వశ్చన్ వేయగా ఈ వందశాతం తప్పు అని ఆనన్య సమాధానమిచ్చింది. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్‌లో లేదని, ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయని విూరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా అలా ఎలా అడుగుతున్నారంటూ అనన్య ఆన్సర్ ఇచ్చింది. అంతేగాక నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవని తెలిపారు. నేను ఆ ఫీల్డ్ లోనే ఉన్నా. విూరు అనుకున్నది ఇక్కడ లేదని అనన్య గట్టిగా బదులిచ్చింది. అక్కడ అనన్య సమాధానాలు విన్న చాలామంది అనన్య ధైర్యాన్ని, బయ పడకుండా చెప్పిన విధానాన్ని చాలామంది మెచ్చుకోవడమే కాక చప్పట్లతో ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ విూడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: రజనీ సార్ సూచనను పట్టించుకోలే : మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్!?
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!