కోలీవుడ్‌లోనూ క్యాస్ట్ కౌచింగ్.. విూడియా సమక్షంలో సనమ్ శెట్టి ఆవేదన!
4 months ago | 36 Views
క్యాస్టింగ్ కౌచ్ అంశం వెలుగులోకి వచ్చి బాగా చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఇప్పుడు తమిళ నటి, బిగ్ బాస్ బ్యూటీ సనమ్ శెట్టి కోలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దర్శక నిర్మాతల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రెస్‌విూట్ పెట్టి మరీ వాపోయింది. టెక్నికల్‌గా సమాజం ఎంత మారినా, మహిళలు ఎన్ని ఉన్నత చదువులు చదివినా అన్ని రంగాల్లోనూ మహిళలకు వేధింపులు తప్పట్లేవన్నారు. ఇటీవలే మలయాళ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి తెలిసి నేను షాకయ్యానని.. అక్కడ ఉన్న అదేవిధమైన పరిస్థితులు తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయని పేర్కొంది. ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టడానికి ఎవరూ ముందుకురారని.. నేనూ ఇలాంటి చేదు సంఘటనలు ఎదుర్కొన్నా అన్నారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు.. ఎందుకు మాట్లాడారని చాలామంది అడుగుతున్నారన్నారు. దీంతో అప్పటి పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు బయటకువచ్చి మాట్లాడలేక పోతున్నామని సనమ్ తెలిపింది. అయితే.. కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఉదంతం అనంతరం సనమ్ షెట్టి తన సోషల్ విూడియా వేదికగా వరలక్ష్మి వత్రం సందర్భంగా ఓ వివాదాస్పద వీడియోను షేర్ చేసింది. మహాలక్ష్మీ దేవి పూజను అందరూ జరుపుకుంటున్నామని.. కానీ మన మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతారని, ప్రాణాలు కాపాడే దేవదూత లాంటి ఓ డాక్టర్‌ను అనాగరికంగా హత్య చేస్తే.. కోల్‌కతాలో రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. నేను దానిని చెన్నైలో క్లెయిమ్ ది నైట్‌గా ప్రారంభించాలనుకుంటున్నా అన్నారు.
ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలికి న్యాయం చేయడంలో సాయం చేయాలని కోరుతున్నానని శెట్టి ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక ఓ ఆడపిల్ల అనుమతి లేకుండా తాకడానికి ఎవరికీ అధికారం లేదన్నారు. తాను ఓ నటిని, ఎంటర్‌టైన్ చేయడమే నా వృత్తి అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ సనమ్ శెట్టి సంచలన వాఖ్యలు చేసింది. దీంతో సనమ్ వాఖ్యలపై ఇప్పుడు సోషల్ విూడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె దృష్టిలో అవకాశాలు లభించిన హీరోయిన్స్ అంతా శరీరాలను సమర్పించుకున్నారా అంటూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా 2012లో తమిళంలో వచ్చిన అంబులి అనే సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ మిస్ సౌత్ ఇండియా సనమ్ శెట్టి ఆ తర్వాత తమిళంలో పాతిక సినిమాల వరకు చేసింది. తెలుగులో మహేశ్ బాబు శ్రీమంతుడులో ఓ చిన్న క్యారెక్టర్‌తో పాటు సంపూర్ణేశ్ బాబు సింగం 123, బిగ్‌మాస్ మానస్ హీరోగా వచ్చిన ప్రేమికుడు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది.
ఇంకా చదవండి: రాముడి పాత్రధారికి ప్రశాంత చిత్తం అవసరం!
# Sanamshetty # Tamil # Socialmedia