రజనీ సార్ సూచనను పట్టించుకోలే : మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్!?
2 months ago | 5 Views
'నాటునాటు’తో ఆస్కార్ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి.. ఎంతోమంది అభిమానాన్ని చొరగొన్న తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విశేషాలు పంచుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో దిగిన ఓ ఫొటో వైరల్‌గా మారడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను చేసిన తప్పు అదేనని.. అందుకు ఎంతో బాధపడుతున్నానని చెప్పారు. 'రంగమార్తాండ’ సినిమా షూట్ వల్ల ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణతో నాకు అనుబంధం ఏర్పడింది. ఆ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు.. నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని అని ప్రకాశ్‌రాజ్‌కు తెలిసింది. దాంతో ఆయన నన్ను పిలిచి.. రేపు తాను రజనీకాంత్ సినిమా షూట్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. నన్ను కూడా రమ్మన్నారు. అలా, 'అన్నాత్తే’ షూట్‌కు వెళ్లా. రజనీ సర్‌కు నన్ను పరిచయం చేశారు. వెంటనే కాళ్లకు నమస్కారం చేశా.
అయితే అప్పుడు ఆయన మూవీ కాస్ట్యూమ్స్ (సినిమాలో కనిపించే లుక్)తో ఉన్నారు. నా ఇష్టాన్ని గమనించి ఫొటో దిగారు. సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా రిలీజ్ చేయలేదని.. కాబట్టి, సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆ ఫొటో ఎక్కడా షేర్ చేయొద్దని చెప్పారు. దాదాపు 10 రోజులు గడిచిపోయాయి. ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్‌విూడియాలో అప్‌లోడ్ చేశా. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడంతో నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటా. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశా‘ అని రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. కథానాయికల్లో దీపికా పదుకొణె అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. 'ఆస్కార్’ వేదిక విూద ఆమె తమని పరిచయం చేసినప్పుడు.. తాను ఎంతో ఆనందించానని అన్నారు.
ఇంకా చదవండి: హనుమంతుడిగా రిషబ్ షెట్టి?.. 'జై హనుమాన్'పై ఊహాగానాలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!