నవ్వుతో హద్దులు చెరిపేయ్యాలి:  శ్రీలీల

నవ్వుతో హద్దులు చెరిపేయ్యాలి: శ్రీలీల

1 month ago | 5 Views

'పుష్ప 2’లో ఐటమ్‌ సాంగ్‌కి శ్రీలీల 5కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నదని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌. ఆమె డ్యాన్సింగ్‌ టాలెంట్‌కి అదేం పెద్ద ఎక్కువ కాదని శ్రీలీల అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ‘ది వైల్డ్‌ చైల్డ్‌’ పేరుతో శ్రీలీల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోషూట్‌ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నది. ఇది కేవలం ముఖ హావభావాలకు సంబంధించిన ఫొటోషూట్‌ కావడం విశేషం. ఈ ఫొటోషూట్‌లో శ్రీలీల తన అందమైన కళ్లను, అంతకంటే అందమైన తన నవ్వునూ ఎలియేట్‌ చేస్తూ తెగ సందడి చేసింది.

Sreeleela: Age, Height, Career, Movies, Net Worth

‘అందంగా నవ్వాలి.. హద్దులు చెరిపేయాలి.. వాలుగా చూడాలి.. కవ్వింతగా కనుసైగ చేయాలి..’ ఇలా కొటేషన్స్‌ ఇస్తూ.. దానికి తగ్గట్టు క్లోజ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో శ్రీలీల కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ఆమె ఐటమ్‌ నంబర్‌ చేసిన ‘పుష్ప 2’ వచ్చే నెల 5న విడుదల కానుంది. అదే నెల 25న క్రిస్మస్‌ కానుకగా నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’తో ప్రేక్షకులను పలకరించనుంది శ్రీలీల. ఇక రవితేజ ‘మాస్‌ జాతర’ ఎలాగూ ఉంది. పవన్‌కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో కూడా శ్రీలీలే వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌. వీటితోపాటు తమిళ్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నదని సమాచారం.

ఇంకా చదవండి: ఆఫర్‌ ఇస్తానంటే.. వార్నింగ్‌ ఇచ్చి వచ్చేశా : కావ్యా థాపర్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# శ్రీలీల     # పుష్ప2     # ఉస్తాద్‌భగత్‌సింగ్‌    

trending

View More