ఎన్టీఆర్‌పై బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ప్రశంసల వర్షం!
4 months ago | 47 Views
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. గత నాలుగు రోజులుగా ఆమె తాజా చిత్రం 'ఉలర్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది. ప్రతి ఇంటర్వ్యూలోనూ తారక్ గురించి ప్రస్తావిస్తోంది. అతని యాక్టింగ్, డాన్స్ గురించి పదేపదే చెబుతోంది. వీరిద్దరూ కలిసి 'దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఈ మేరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర' సినిమా షూటింగ్ అనుభవాలను షేర్ చేశారు జాన్వీ కపూర్. ‘తెలుగువారి పనితీరు నాకు ఎంతో ఇష్టం. వారు కళను, సినిమాను గౌరవిస్తారు వారి వ్యవహారం హుందాగా ఉంటుంది. కథపై నమ్మకంతో పని చేస్తారు. ప్రస్తుతం నేను 'దేవర’లో నటిస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. ఆయన రాగానే సెట్‌కే కళ వస్తుంది.
అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో మా ఇద్దరిపై ఓ పాటను చిత్రీకరించారు. తారక్ డాన్స్ వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎన్టీఆర్ ఒక్క సెకనులో దేన్నైనా నేర్చుకోగలరు. అదే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు 10 రోజులు పడుతుంది. ఆయనతో తర్వాత పాట షూటింగ్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. దర్శకుడు కొరటాల శివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయమైనా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం ఈజీగా ఉంది‘ అని అన్నారు. వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ’ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నా తల్లిదండ్రులు నేర్పారు. వాళ్లతో పాటు నా ఫ్యాన్స్ నన్ను చూసి గర్వించేలా ఉంటాను. ప్రస్తుతం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. రిలేషన్ గురించి వెల్లడించే సమయం లేదు. ఇటీవల ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇప్పుడే కోలుకుంటున్నా’ అని జాన్వీ చెప్పారు.
ఇంకా చదవండి: చిరు మూవీల్‌లో 'ఇంద్ర' ట్రెండ్ సెట్టర్!
# Devara # JrNtr # SaifAliKhan # PrakashRaj # JanhviKapoor # OTT