రిలేషన్‌షిప్‌లో చేదు అనుభవాలు... నటి తమన్నా స్వానుభవం!

రిలేషన్‌షిప్‌లో చేదు అనుభవాలు... నటి తమన్నా స్వానుభవం!

3 months ago | 45 Views

రిలేషన్‌షిప్‌లో తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని నటి తమన్నా చెప్పారు. టీనేజ్‌లోనే తొలిసారి ప్రేమలో పడ్డానని..  కొన్ని కారణాలతో అది వర్కౌట్‌ కాలేదని తెలిపారు. తన జీవితంలో రెండు బ్రేకప్స్‌ ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ రెండుసార్లు నా హృదయం ముక్కలైంది. ఆ సమయంలో నాకెంతో బాధగా అనిపించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్‌ ఎదుర్కొన్నాను. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని.. కొత్త విషయాలు అన్వేషించాలనేది నా భావన.


ఆ కారణంతోనే ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నా. అయితే.. అతడు నాకు సెట్‌ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమైంది. అలా అది కూడా ముగిసిపోయిందని తమన్నా తెలిపారు. రాజమౌళితో వర్క్‌ చేయడంపై స్పందిస్తూ.. బాహుబలి’ కోసం నేను రాజమౌళితో కలిసి పని చేశాను. అద్భుతమైన వ్యక్తి. కమర్షియల్‌ చిత్రాల్లోనూ భావోద్వేగాలను కీలకంగా చూపిస్తారు. మూగజీవాలు.. మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్‌నూ చక్కగా తెరపైకి తీసుకువస్తారు. కథ చెప్పే విధానం బాగుంటుంది. ఆయన ప్రీ ప్రొడక్షన్‌ మరో స్థాయిలో ఉంటుంది. సీన్‌ ఏదైనా సరే.. నటీనటుల కంటే ముందు ఆయనే రిహార్సల్స్‌ చేస్తారు. ’బహుబలి’లో కొన్ని సన్నివేశాల్లో నేను విల్లు పట్టుకుని కనిపిస్తా.

ఆ సీన్స్‌లో ఎలా యాక్ట్‌ చేయాలో ఆయనే నాకు వివరించి చెప్పారని తెలిపారు. దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా ఎమోషన్స్‌ ఉంటాయని.. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు సినిమా కథలు రాస్తారన్నారు. అనుకున్న కథను పూర్తిస్థాయిలో స్క్రీన్‌పైకి తీసుకు వచ్చేందుకు కష్టపడతారని కొనియాడారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు తమన్నా. ’స్త్రీ 2’లో స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న 'ఓదెల 2’ చిత్రీకరణ దశలో ఉంది. తమన్నా కొంతకాలంగా విజయ్‌ వర్మతో రిలేషన్‌లో షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. 'లస్ట్‌ స్టోరీస్‌’ సమయంలో తమ మధ్య రిలేషన్‌ మొదలైందని ఇప్పటికే ఈ జంట పలు సందర్భాల్లో తెలియజేసింది.

ఇంకా చదవండి: సర్వైవర్ సినిమాతో ఎన్నో అవార్డులను గెలుచుకున్న రజత్ రజనీకాంత్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# TamannaahBhatia     # VijayVarma     # Mumbai    

trending

View More