హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు గుర్తింపు

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు గుర్తింపు

3 months ago | 49 Views

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రాజ్‌ తరుణ్‌ తనకు కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్‌ తరుణ్‌ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్‌ తరుణ్‌, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్‌-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్‌ ముందస్తు బెయిల్‌ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై ఏబీఎన్‌తో లావణ్య మాట్లాడుతూ.. రాజ్‌ తరుణ్‌పై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడం శుభ పరిణామమని తెలిపింది. తనను ఎన్నో మాటలు అన్నారని.. చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొంది. రాజ్‌ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని తెలిపింది. తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని పేర్కొంది.


రాజ్‌ తరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని వెల్లడిచింది. శేఖర్‌ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య పేర్కొంది.రాజ్‌తరుణ్‌ శిక్ష అనుభవించాలని తాను కోరుకోను, కానీ తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని వెల్లడిరచింది. రాజ్‌ తరుణ్‌, తాను పదేళ్లపాటు కలిసి సంసారం చేశామనేది అనేది వాస్తవమని లావణ్య తెలిపింది.

వాటికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చానని వెల్లడిరచింది. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్‌ తరుణ్‌ వదిలించుకోవాలని చూశాడని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. మాల్వి మల్హోత్రా రాజ్‌ తరుణ్‌ ఇద్దరికీ ఎఫైర్ఉందని మరోమారు లావణ్య తెలిపింది. వాటికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు ఇచ్చానని లావణ్య వెల్లడించింది.

ఇంకా చదవండి: ఐశ్వర్య లక్ష్మి లుక్‌ నెట్టింట వైరల్‌ !

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# RajTarun     # Tollywood    

trending

View More