టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్‌ !

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్‌ !

12 days ago | 5 Views

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. జానీను డ్యాన్సర్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తుంది. తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రానంతవరకు డ్యాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జానీ మాస్టర్‌ కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో అప్పుడే ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్‌ ప్రకాశ్‌ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి. ఇక కొత్త పాలక వర్గం ఎన్నుకున్న అనంతరం జానీని ఈ అసోసియేషన్‌ను తొలగించారని  తెలుస్తుంది.

ఇంకా చదవండి: షారుఖ్‌ఖాన్‌ రికార్డు బద్దలుకొట్టిన అల్లుఅర్జున్‌!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జానీ మాస్టర్‌     # టాలీవుడ్‌    

trending

View More