మరో ఛాన్స్ కొట్టేసిన భామ!! నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి సరికొత్త సినిమా
1 month ago | 5 Views
‘తండేల్’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తరవాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు చిత్ర వర్గాల నుంచి సమాచారం. చైతూ పక్కన నటించడం మీనాక్షికి ఇదే మొదటిసారి.. ఈ కాంబో ఫ్రెష్ గా ఉంటుందని చిత్రబృందం అనుకుంటోందట. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టు ఫిక్సయింది. మీనాక్షి చౌదరి ఈ ఏడాదంతా బిజీ బిజీగా గడుపుతోంది.
సంక్రాంతికి ఆమె నటించిన ‘గుంటూరు కారం’ విడుదలైంది. మహేశ్‌కు మరదలుగా కని పించింది. ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’తో సూపర్‌హిట్ అందుకుంది. మొన్నే 'మట్కా' విడుదలైంది. ఈ వారం విడుదల కానున్న 'మెకానిక్ రాకీ'లో కూడా ఆమె కథానాయికగా నటించింది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ కథానాయిక గా మారింది మీనాక్షి. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇప్పుడు చైతూ సినిమా కూడా యాడ్ అయింది.
ఇంకా చదవండి: ఘనంగా 'సినిమాటికా ఎక్స్‌పో' కార్యక్రమం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# మీనాక్షిచౌదరి # తండేల్ # మట్కా