యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్ర భామ అలీషా

2 months ago | 5 Views

పలు ప్రకటనలు, సినిమాల్లోని పాత్రలతో అందరినీ ఆకట్టుకుంది కుర్ర భామ అలీషా. హైద్రాబాదీ అమ్మాయి అయిన అలీషా  మోడలింగ్ రంగం మీద మక్కువ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల్లోనే కాకుండా బాస్కెట్ బాల్, చెస్ వంటి ఆటల్లోనూ అలీషా ముందుంటుంది. ఎంతో ప్యాషన్‌తో, నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఆకాశన్నందుకోవాలనే అంతులేని కలలు, ప్యాషన్ ఉన్న యువతకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో అలీషా ప్రయాణిస్తోంది. నాకు ఎన్నో కలలు ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. నా ఈ ప్రయాణాన్ని అందరితో పంచుకుని స్పూర్తి నింపాలని ప్రయత్నిస్తుంటాను. సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడి అందరూ తమ తమ కలల్ని సాకారం చేసుకోగలరు.


ఓ భీం బుష్, మాతృ, ఫైటర్ రాజా వంటి చిత్రాల్లో మంచి పాత్రలను పోషించింది. బ్రైడల్ షూట్, గ్లోబల్ ఎడ్యుటెక్ వంటి వాటికి యాడ్స్, పొలిటిక్ పార్టీ ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎద లోయల్లో ఇంద్రధనస్సు వంటి సీరియల్‌తో క్రేజ్ తెచ్చుకుంది.  ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంది.

ఇంకా చదవండి: వైరల్‌గా మారిన నటి అనన్య నాగళ్ల వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్‌లకు కౌంటర్‌!!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Alisha     # OmBheemBush     # Matru    

trending

View More