గ్లోబల్ స్టార్ కు శుభాకాంక్షల వెల్లువ!
2 months ago | 5 Views
గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెబల్ స్టార్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పారు. '' ప్రస్తుతం ఉన్న సక్సెస్‌ఫుల్ నటవారసులంతా ‘తండ్రులకి తగ్గ తనయులు’, ‘అన్నలకు తగ్గ తమ్ముళ్లు’, ‘తాతలకు తగ్గ మనవళ్లు’. కానీ ప్రభాస్‌ను మాత్రం వీరితో మినహాయించాలి. ఎందుకంటే.. ప్రభాస్ ‘తండ్రికి తగ్గ తనయుడు’ కాదు. ‘తండ్రిని మించిన తనయుడు’. ఈ మాటను నిర్మొహమాటంగా, నిర్భయంగా ఢంకా బజాయించి మరీ చెప్పేయొచ్చు.. స్వతహాగానే ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఛాతి కాస్త వెడల్పు. ప్రభాస్ పుణ్యమా అని.. గోరంత గర్వంతో.. కొండంత ఆనందంతో అది ఇంకాస్త వెడల్పయింది. జీవించి ఉన్నంతకాలం పెదనాన్నకు కావల్సినంత పుత్రోత్సాహాన్ని ఇచ్చేసిన తనయుడు ప్రభాస్'' అంటూ తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతేడాది 'సలార్‌తో' బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు.. లేటెస్ట్‌గా 'కల్కి 2898 ఏడీ'తో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. అయితే సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ 'భలే భలే మొగాడివోయ్' ఫేమ్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్' . ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే కావడంతో వేడుకలు మొదలుపెట్టారు అభిమానులు. బర్త్‌డే రోజు అతడు నటించే సినిమాల నుంచి అప్‌డేట్‌లు కూడా వచ్చాయి.
ఇదిలావుంటే డార్లింగ్ బర్త్‌డే కానుకగా 'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజా సాబ్' కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్ ఇప్పటివరకు చేయని రొమాంటిక్, హారర్ జోనర్ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తినెలకొని ఉంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసి గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను వెల్లడించనున్నారు. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ అల్ట్రాస్టయిలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకుముందెప్పుడూ చూడని రొమాంటిక్ అవతారంలో కనిపిస్తారని, అభిమానులకు పండగలా దర్శకుడు మారుతి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడని మేకర్స్ తెలిపారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మారుతి టీం అదిరిపోయే కానుకను రెడీ చేసింది. సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడీ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజా సాబ్ స్నీక్ పీక్ వరల్డ్ గ్లింప్స్ వీడియోను లాంచ్ చేయనున్నట్టు నిర్మాత ఎస్‌కేఎన్ హింట్ ఇచ్చేశారని తెలిసిందే. ఇక గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న సీన్లు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 2004 సంక్రాంతి గుర్తుందా? ప్రభాస్ మూడో సినిమా ‘వర్షం’. కాసుల వర్షమే కురిపించేసింది. ‘ఛత్రపతి’లో ‘ఒక్క అడుగు’ అని అడిగినందుకు అభిమానులు అడుగడుగునా గుండెలలో గుడులు కట్టేశారు. ఇక ‘బాహుబలి’ గురించి చెప్పేదేముంది.. ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లు. ‘సలార్’ 600కోట్లు. రీసెంట్ హిట్ ‘కల్కి 2898 ఏడీ’ వెయ్యికోట్లు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా హిట్ అయితే వెయ్యికోట్లు. ఫ్లాపైతే 200కోట్లు. అసలు ‘ఈశ్వర్’ టైమ్‌లో ఇంతటి వైభవం ఊహించామా!? పాన్ ఇండియా స్టార్‌డమ్‌ని ప్రపంచానికి పరిచయం చేయడమంటే సామాన్యమైన విషయమా!? .. కటౌట్‌ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి.. తప్పదు. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమనులకు ఇదే పెద్ద పండగ.
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రభాస్‌కు బర్త్ డే విషెస్‌కు చెప్తూనే.. మరోవైపు పొట్టేల్ ప్రమోషన్స్ కూడా చేస్తుంది టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల టీం. పొట్టేల్‌ను తీసుకొని యువ చంద్ర, అనన్యనాగళ్ల, నోయెల్ కలిసి దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికెళ్లింది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పొట్టేల్ సినిమా ఘనవిజయం సాధించాలని విష్ చేసింది. ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునేలా పొట్టేల్ ప్రమోషన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: పొట్టేల్'లో చేసిన పటేల్ క్యారెక్టర్ టెర్రిఫిక్ గా వచ్చింది. బిగ్ కాన్వాస్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి: యాక్టర్ అజయ్