బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. సెప్టెంబర్‌ 1న ఘన సన్మానికి నిర్ణయం!

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. సెప్టెంబర్‌ 1న ఘన సన్మానికి నిర్ణయం!

1 month ago | 25 Views

నందమూరి బాలకృష్ణ 50ఏళ్ల సినీ ప్రయాణం సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమ ఆయనను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకుంది.నందమూరి బాలకృష్ణ తొలిసారి నటించిన ’తాతమ్మ కల’ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే రానున్న ఆగస్టు 30కి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ క్రమంలో తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ ఇటీవల బాలకృష్ణని కలిసి, సన్మాన వేడుకు అంగీకరించాలని కోరగా అందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేసథ్యంలో సెప్టెంబర్‌ 1న సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

సన్మాన వేడుకకు దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్టీల్రు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్విస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన, చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ ఓ ఆహ్వాన పత్రికను రూపొందించి విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ సినిమాల పరంగా సాధించిన రికార్డులను, రాజకీయాల్లో, సామాజిక కార్యమాల్లో ఆయన చేస్తున్న సేవలను పొందుపరిచారు. ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రిక సోషల్‌ విూడియాలో బాగా వైరల్‌ అవుతోంది. విూరూ చూసేయండి.

ఇంకా చదవండి: రాజకీయాలకు దూరంగా ఉంటున్నా: 'బడ్డీ' ప్రమోషన్‌లో అలీ స్పష్టీకరణ

# Nandamuribalakrishna     # Tollywood     # Socialmedia    

trending

View More