వెంకటేశ్‌ మూవీ సెట్‌లో బాలయ్య సందడి!

వెంకటేశ్‌ మూవీ సెట్‌లో బాలయ్య సందడి!

2 months ago | 30 Views

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా సెట్స్‌లో 'భగవంత్‌ కేసరి’ బాలయ్య సందడి చేశారు. బాలయ్యతో 'భగవంత్‌ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడి చేస్తున్న చిత్రం వెంకీ-అనిల్‌3. అందుకే 'భగవంత్‌ కేసరి’ సందడి చేశారని పేర్కొనడం జరిగింది. విక్టరీ వెంకటేష్‌ , బ్లాక్‌బస్టర్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ఎంటర్‌టైనర్‌ వెంకీఅనిల్‌3. ఇటీవల పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సెట్స్‌లోకి ప్రత్యేక అతిథి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. లేటెస్ట్‌ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ వెంకీఅనిల్‌3 సెట్స్‌లో సందడి చేశారు.

ఈ ఆన్‌`లొకేషన్‌ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి మధ్య సోదరభావం చూడటం డిలైట్‌ ఫుల్‌గా వుంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి ఆల్‌`టైమ్‌ హిట్‌ ’భగవంత్‌ కేసరి’ని రూపొందించారు. ఈ మూవీ ఇటీవల ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం వెంకీమామ సెట్స్‌లో బాలయ్య ఉన్న పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.వెంకీఅనిల్‌3 చిత్రంలో వెంకటేష్‌ భార్యగా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తుండగా, విూనాక్షి చౌదరి ఎక్స్‌ లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్‌ కైమ్ర్‌ డ్రామాని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. టాప్‌ టెక్నిషియన్స్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సవిూర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌, తమ్మిరాజు ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్‌. వి వెంకట్‌ యాక్షన్‌ డైరెక్టర్‌. ఈ సినిమాని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి: 'దేవర' స్పెషల్‌ షోలకు అనుమతి: ఎపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Bhagavanthkesari     # Nandamuribalakrishna     # Venkatesh    

trending

View More