బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌-4' రెడీ!

బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌-4' రెడీ!

2 months ago | 5 Views

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ షో 'అన్‌స్టాపబుల్‌’ సీజన్‌-4’  స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. దీపావళి పండగని పురస్కరించుకొని తొలి ఎపిసోడ్‌ రిలీజ్‌ చేసేందుకు ప్రయ్నత్నాలు జరుగుతున్నాయి. అయితే 'అన్‌ స్టాపబుల్‌ 4' ఫస్ట్‌ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్‌ గెస్ట్‌గా రానున్నట్లు వార్తలు వచ్చాయి.  'పుష్ప 2' మూవీ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో 'పుష్ప' టీమ్‌ గెస్ట్‌ లుగా రానున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ షూట్‌ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా 'పుష్ప' మూవీ డిసెంబర్‌లో రిలీజ్‌ కానుండటంతో ఈ ఎపిసోడ్‌ని మూవీ రిలీజ్‌ టైమ్‌లో విడుదల చేద్దామని ప్లాన్‌ చేశారట. దీంతో ఫస్ట్‌ ఎపిసోడ్‌ కోసం ఇద్దరు ప్రభుత్వాధినేతలను పిలుస్తున్నట్లు సమాచారం.


మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ షోకి మరోసారి గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎపిసోడ్‌నే తొలి ఎపిసోడ్‌గా దీపావళి కానుకగా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తుందట 'ఆహా'. అయితే చంద్రబాబు నాయుడితో పాటు ఈ ఎపిసోడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హాజరు కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న అఫిషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు. కాగా సోషల్‌ విూడియా వేదికగా బన్నీ వర్సెస్‌ మెగా ఫ్యాన్స్‌గా నడుస్తున్న గొడవలకి ఈ షో ఏమైనా ఫుల్‌ స్టాప్‌ పెడుతుందా చూడాలి.

ఇంకా చదవండి: కాస్ట్‌ కౌచింగ్‌ అంతా దుష్పచ్రారమే: తెలుగు పరిశ్రమపై అనన్య నాగళ్ల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Unstoppable4     # Balakrishna    

trending

View More