బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌'లో చిరంజీవి!

బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌'లో చిరంజీవి!

4 months ago | 33 Views

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ  షో కొత్త సీజన్‌ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. కొత్త సీజన్‌ సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని కథానాయకులు, దర్శకులు, ఇతర ప్రముఖులతో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోష్‌తో సాగనుంది. ఈసారి ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు చిరంజీవి రాబోతున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడటమే తరువాయి. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడవచ్చని టాక్‌ వినిపిస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణలది ప్రత్యేక స్థానం. మాస్‌ హీరోలుగా వాళ్లకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి స్టార్‌లు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన  వినోదం ఏముంటుంది? చిరుతో పాటు, మరో అగ్ర కథానాయకుడు నాగార్జున కూడా ఈ సారి పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్లతో పాటు, మరికొన్ని సర్‌ప్రైజ్‌ లు  ఉంటాయని తెలుస్తుంది. దీనిపై'ఆహా’ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంకా చదవండి: ఘ‌నంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుక‌లు సందడి చేసిన సినీ ప్రముఖులు...

# Balakrishna     # Chiranjeevi     # Tollywood    

trending

View More