బాహుబలి' యానిమేటెడ్‌ సీరిస్‌... ప్రత్యేక  సందేశం ఇచ్చిన రాజమౌళి!

బాహుబలి' యానిమేటెడ్‌ సీరిస్‌... ప్రత్యేక సందేశం ఇచ్చిన రాజమౌళి!

1 month ago | 19 Views

భారత సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి’ తాజాగా యానిమేటెడ్‌ సిరీస్‌గా ఓటీటీ  స్ట్రీమింగ్ కు   సిద్ధమైంది. మే 17 నుంచి డిస్నీహాట్‌స్టార్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. ఈ సందర్భంగా రాజమౌళిఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు సందేశమిచ్చారు.'బాహుబలి సిరీస్‌ను ఇంకా కొనసాగించండి అని ఎందరో  అభిమానులు అడిగారు. వారందరి కోసం 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ని రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌కు పనిచేసిన గ్రాఫిక్‌ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించాం. 9 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ విూ ముందుకు వస్తోంది. అందరూ చూసి ఎంజాయ్‌ చేయండి. విూ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఇక ఇటీవల విూడియా సమావేశంలో రాజమౌళి ఈ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలిని థియేటర్‌లో దాదాపు 10 కోట్ల మంది మాత్రమే చూశారు. మిగతా వాళ్లు టెలివిజన్‌, ఓటీటీలో చూసి ఉంటారు. ప్రతిఒక్కరూ సినిమాను ఏదో ఒక మాధ్యమం ద్వారా చూస్తారు. అందరూ రెగ్యులర్‌ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్‌ మూవీలను మాత్రమే ఆస్వాదించే వాళ్లూ ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి యానిమేటెడ్‌ సిరీస్‌ను తీసుకొస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దీనికి 'మహారాజ్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేష్ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసినట్లు టాక్‌.

ఇంకా చదవండి: 'గబ్బర్‌ సింగ్‌' కథపై ఆసక్తి చూపని పవన్‌.. ఆనాటి స్మృతులు నెమరేసుకున్న హీరో!!

# Baahubali     # Prabhas     # Rana Daggubati