'బాహుబలి-3' ఉంటుంది: తమిళ నిర్మాత కె.ఈ జ్ఞానవేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

'బాహుబలి-3' ఉంటుంది: తమిళ నిర్మాత కె.ఈ జ్ఞానవేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

2 months ago | 5 Views

'బాహుబలి-3’ గురించి తమిళ నిర్మాత కె.ఈ జ్ఞానవేల్‌ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.  ఈ సినిమా రెండు భాగాలు సక్సెస్‌ సాధించి భారీ వసూళ్లు రాబట్టడంతో అభిమానులు పార్ట్‌ 3 కోసం ఎదురు చూస్తున్నారు.  తాజాగా కే.ఈ  జ్ఞానవేల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై ఆసక్తికర కామెంట్‌ చేశారు. 'కంగువా’ సీక్వెన్స్‌ల మధ్య  గ్యాప్‌ను సమర్థిస్తూ  'బాహుబలి -3’ ప్రస్తావనను తీసుకొచ్చారు. 'కంగువా’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ''గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్‌ 3 ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు. దానికంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే 'కల్కి 2’, 'సలార్‌ 2’ రిలీజ్‌ అవుతాయి’ అని అన్నారు.

దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'బాహుబలి-3’ కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్‌ సోషల్‌ విూడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. గతంలో కూడా రాజమౌళి ఒక సందర్భం లో 'బాహుబలి-3’ గురించి మాట్లాడారు. దీని మూడో భాగం ఉంటుంది. 'బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి విూకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమా రావడానికి కాస్త సమయం పట్టొచ్చు.  కానీ 'బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికర వార్త అయితే కచ్చితంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి..మహేశ్‌ సినిమాతో 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు, ఫొటో షూట్‌లు జరుగుతున్నాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ  భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇంకా చదవండి: చిత్రసీమ అండతోనే ధైర్యంగా నిలబడ్డా : కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోమారు స్పందించిన సమంత

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Baahubali3     # SSMB29     # GnanavelRaja    

trending

View More