రకుల్ ప్రీత్ సింగ్ పై దారుణమైన ట్రోలింగ్..!
1 month ago | 5 Views
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ మూవీ ‘గిల్లి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తొలిసారిగా ‘కెరటం’లో నటించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో మంచి గుర్తింపును సాధించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మోగా హీరో రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరమైంది. చివరగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లయిన బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వస్తున్నది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్‌పై ట్రోలింగ్ జరుగుతున్నది. దీపావళి పండుగ ఫైర్ క్రాకర్స్ గురించి చేసిన వ్యాఖ్యలను పలువురు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు రకుల్ బదులిస్తూ.. ‘దీపావళికి అంతా ఫైర్‌కాకర్స్ కాలుస్తుంటారు. చిన్నప్పుడు దీపావళి పండుగ సమయంలో మా పాప రూ.500 నోట్ ఇచ్చాడు. ఇప్పుడు రూ.500 ఎందుకిస్తున్నారు? అని అడిగాను. ఈ డబ్బుతోనే కదా నువ్వు ఫైర్‌కాకర్స్ కొని కాలుస్తావు. దాంతో ఎంత కాలుష్యమో తెలుసా? అని ప్రశ్నించారు. అదే డబ్బును అవసరం ఉన్న పేదవారికి ఇవ్వొచ్చని.. లేకపోతే చాక్‌లెట్స్, ఇంకా ఏమైనా కొని ఇవ్వచ్చని చెప్పారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించిందని, ఆ సమయంలో 5వ తరగతి చదువుతున్నాను. అప్పటి ఇప్పటి వరకు మళ్లీ బాణాసంచా కాల్చలేదు’ అంటూ రకుల్ వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు ఆమెపై ట్రోల్ చేస్తున్నారు. ఓ యూజర్ ఖరీదైన బట్టలు ఎందుకు ధరిస్తున్నారు ? అదే డబ్బును పేదలకు దానం చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మరొకరు చికెన్ తినే సమయంలో నోట్లు కూడా తింటారా? మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘దేవుడికి ధన్యవాదాలు. నా తల్లిదండ్రులు ఇలా కాదు. నా బాల్యాన్ని ఎంజాయ్ చేసేందుకు అనుమతించారు. మంచి చెడులకు మధ్య తేడాను కూడా నేర్పించారు’ మరో నెటిజన్ అంటూ స్పందించాడు. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ చివరగా 'ఇండియన్-2' మూవీలో నటించింది. ప్రస్తుతం, హిందీలో అజయ్ దేవగన్‌తో ‘దే దే ప్యార్ దే 2’ మూవీలో నటించనున్నది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నది.
ఇంకా చదవండి: ఎనిమిదేళ్ల బాలుడి చేతిలో మోసపోయా: నవతరం కథానాయిక నివేదా పేతురాజ్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రకుల్ ప్రీత్ సింగ్ # రామ్‌చరణ్ # మహేశ్‌బాబు