హేమ కమిటీ రిపోర్ట్ గురించి అడక్కండి:హీరోయిన్ ఆండ్రియా జెర్మయ్య
3 months ago | 32 Views
మలయాళ చిత్రపరిశ్రమలో అవకాశాల పేరుతో 'అడ్జెస్ట్‌మెంట్’పై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై తనను ప్రశ్నించవద్దంటూ సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మయ్య స్పష్టంచేశారు. తిరువాన్మియూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను విూడియా జస్టిస్ హేమ కమిషన్‌పై ప్రశ్నలు సంధించింది. దీనికి ఆండ్రియా జెర్మయ్య సమాధానమిస్తూ, చిత్రపరిశ్రమలో మహిళల లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై నో కామెంట్స్, ఈ అంశంలో ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు’ అంటూ కోరారు. నిజానికి ప్రతి అంశంలో ఎంతో బోల్డ్‌గా స్పందించే నటి ఆండ్రియా.. జస్టిస్ హేమ కమిషన్‌పై మాట్లాడేందుకు నిరాకరించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంకా చదవండి: జోరుగా సినీ తారల విరాళాలు..
# AndreaJeremiah # HemaCommittee