గూగుల్‌ను అడిగితే నా గురించి చెబుతుంది: స్విట్జర్లాండ్ విూడియాతో షారూఖ్ సరదా వ్యాఖ్యలు
4 months ago | 39 Views
బాలీవుడ్ హీరో షారుక్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మకమైన పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. స్విట్జర్లాండ్ వేదికగా ఈ ఈవెంట్ జరిగింది. అక్కడి విూడియాతో మాట్లాడుతూ షారుక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ’నా గురించి తెలియక పోతే గూగుల్‌ను అడగండి. అది ఏం చెబుతుందో విని నన్ను ప్రశ్నలు అడగండి’ అని షారుక్ సరదాగా అన్నారు. ఈ వ్యాఖ్యలపై గూగుల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించింది. విూరు కింగ్ అనే అర్థం వచ్చేలా కిరీటం ఎమోజీని పోస్ట్ చేసి షారుక్‌ను ట్యాగ్ చేసింది. దీనిపై అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ’సినీ పరిశ్రమకు విూరు కింగ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ’విూరు కింగ్ అని గూగుల్‌కు కూడా తెలుసు’ అని మరో అభిమాని అన్నారు. ఈ ఈవెంట్‌లో షారుక్ మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రపరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. ’సౌత్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన వారున్నారు. గొప్ప కథలను తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినీ రంగంలో గొప్ప సూపర్ స్టార్‌లు చాలా మంది సౌత్ నుంచి వచ్చిన వారే. అక్కడి వారితో కలిసి నేను పనిచేశాను. ఎక్కువ మంది దర్శకులతో కలిసి వర్క్ చేయాలని ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రత్యేకమే. మణిరత్నం దర్శకత్వంలో 'దిల్‌సే’లో నటించాను. ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి. 'బాహుబలి’, 'ఆర్‌ఆర్‌ఆర్’, 'జవాన్’ వంటి చిత్రాలు ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భారీ బ్జడెట్ చిత్రాలను రూపొందించడంలోనూ దక్షిణాది పరిశ్రమ ముందుంటుంది’ అని చెప్పారు.
చిత్ర పరిశ్రమకు ఆయనందించిన సేవలకుగాను షారుక్ పార్డో అల్లా కెరియరా అవార్డును అందుకున్నారు. ఇలాంటి గౌరవాన్ని పొంది చరిత్ర సృష్టించిన మొదటి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్ నిలిచారు. సినిమాల విషయానికొస్తే.. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ 'కింగ్’లో నటించనున్నారు.
ఇంకా చదవండి: "తంగలాన్" కు మ్యూజిక్ చేయడం ఎంతో సంపృప్తినిచ్చింది - మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్
# Shahrukhkhan # Socialmedia # Bollywood