ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలు..  చర్యలు తీసుకోవాలంటూ మంచు విష్ణు లేఖ

ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలు.. చర్యలు తీసుకోవాలంటూ మంచు విష్ణు లేఖ

3 months ago | 27 Views

'కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌ పాత్ర గురించి తక్కువ చేస్తూ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ మాట్లాడిన తీరుపై  ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఖండించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంలో మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కు లేఖ రాశారు.  ’కల్కి 2898 పై  తన అభిప్రాయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్షద్‌ వార్సీ పంచుకున్నారు.

అయితే ఈ క్రమంలో ఆయన ప్రభాస్‌ పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. అవి టాలీవుడ్‌ నటుడు, అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని అధ్యక్షురాలు పూనమ్‌ ధిల్లాన్‌కు రాసిన లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు. ’ప్రతి వ్యక్తికి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది. దాన్ని మేమూ గౌరవిస్తున్నాం. కానీ, అర్షద్‌ వ్యాఖ్యలు ప్రభాస్‌ను తక్కువ చేసేలా ఉన్నందుకు బాధపడుతున్నాం. సోషల్‌ విూడియా ఇలాంటి విషయాలు త్వరగా వైరల్‌ అవుతాయి. ఆ విషయాన్ని అందరూ గమనించాలి.


మాటకు చాలా శక్తి ఉంటుంది. అది ఇద్దరి మధ్య బంధాలను బలపరచగలదు, గొడవలూ సృష్టించగలదు. అర్షద్‌ కామెంట్స్‌ నెగెటివిటీని తీసుకొచ్చేలా ఉన్నాయి. నటీనటుల మధ్య ఐక్యత, గౌరవం కోసం ఎప్పుడూ ముందుండే అసోసియేషన్‌ అర్షద్‌ వ్యాఖ్యలపై స్పందిస్తుందని నమ్ముతున్నాం. విూ మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్‌ చేయకుండా ఆయనకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రాంతాలతో, భాషతో సంబంధం లేకుండా నటీనటులంతా గౌరవంగా ఉండాలని కోరుతున్నాం. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ ఐక్యతను కాపాడుకుందాం అని తన లేఖలో మంచు విష్ణు అన్నారు.

ఇంకా చదవండి: క్లైమాక్స్‌ చిత్రీకరణలో 'పుష్పా2'

# Kalki2898AD     # Prabhas     # DeepikaPadukone     # KamalHaasan     # DishaPatani