అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. పాత కథకు కొత్త మెరుగులు!
14 days ago | 5 Views
నిర్మాణంలో ఉండగానే చర్చనీయాంశమైన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కల్యాణ్‌రామ్ సినిమా అనగానే మాస్ ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపించడం సాధారణం. ఈ సినిమాలో ఆయనకు సీనియర్ నటి విజయశాంతి కూడా తోడవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా తల్లీకొడుకుల నేపథ్య కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విజయశాంతి తనకు బాగా కలిసొచ్చిన పోలీసాఫీసర్ రోల్ చేశారు. కల్యాణ్‌రామ్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలియజేశారు. కథలోకి వెళితే..వైజయంతి(విజయశాంతి) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీస్. ఆమెకు ఒక్కకానొక్క కొడుకు అర్జున్(కల్యాణ్‌రామ్). అర్జున్‌ని ఎలాగైనా ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది వైజయంతి కల. అందుకు తగ్గట్టే తనను ఐపీఎస్ చదివిస్తుంది. ట్రైనింగ్ కోసం ఢిల్లీ పంపిస్తుంది. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగిరావాల్సిన అర్జున్.. వెళ్లిన అయిదోరోజే తిరిగి వచ్చేస్తాడు. కారణం తన తండ్రి మరణం. నేవీ అధికారి అయిన తన తండ్రి సముద్రంలో ప్రమాదవశత్తూ మరణించాడని పోలీసులు చెబుతారు. నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు.. అదో హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్.. తన తండ్రిని చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ.. అర్జున్‌ని వైజయంతి వారిస్తుంది. చట్టప్రకారం దోషులకు శిక్షపడేలా చేస్తానని, నువ్వు ఐపీఎస్ పూర్తి చేయాలని చెప్పి కొడుకుని మళ్లీ ట్రైనింగ్‌కి పంపించేస్తుంది. ఏడాది తర్వాత అర్జున్ శిక్షణ ముగించుకొని తిరిగొస్తాడు. తన తండ్రి కేసుకు సంబంధించిన
జడ్జిమెంట్ ఆరోజే. అర్జున్ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశత్తే జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుంచి బయటకొస్తూనే వైజయంతిని అవమానంగా మాట్లాడతారు. అన్యాయం ముందు చట్టం, న్యాయం ఓడిపోవడం కళ్లారా చూస్తాడు అర్జున్. తన కళ్లముందే తల్లిని అవమానిస్తుంటే భరించలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే హంతకుడ్ని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలో 41మందిని నరికి చంపేస్తాడు. ఐపీఎస్ కావాల్సిన కొడుకు కంటిముందే హంతకుడుగా మారడం చూసిన వైజయంతి నిశ్చేష్టురాలైపోతుంది. గూండాగా మారిన కొడుకు విూదే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి విడదీసిన ఈ తల్లీబిడ్డలు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గూండాగా మారి సాధించిందేంటి? అన్నదే సినిమా కథ.భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్ ఇది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సినిమాను నడిపించిన విధానం బావుంది. హీరోను గూండాగా ఓపెన్ చేసి, తాను అలా మారడానికి గల కారణాన్ని హృద్యంగా చెప్పిన తీరు బావుంది. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోవడం.. ఈ క్రమంలో కష్టాల్లోవున్న జనాలకు అండగా నిలవడం.. కథలో ప్రధానమైన అంశాలు ఈ రెండు అయితే.. వీటికి తోడు డ్రగ్స్‌ని, మాఫియాని కూడా లింక్ చేశాడు దర్శకుడు. ఒకడ్ని మించిన ఒకడ్ని విలన్‌గా పరిచయం చేసుకుంటూ.. ఒకడి తర్వాత ఒకడ్ని చంపుకుంటూ మొత్తంగా తెరంతా రక్తపాతాన్ని సృష్టించేశాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బావున్నాయి. ఓ దశలో కథలోని ఎమోషన్‌ని యాక్షన్ డామినేట్ చేసిందా అనిపిస్తుంది.
ఇంకా చదవండి: రజనీ కూలీకి తెలుగులో డిమాండ్!?
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!