ప్రభాస్‌తో అను రాఘవపూడి జత.. ఫౌజీని తెరకెక్కించే యత్నాలు!

ప్రభాస్‌తో అను రాఘవపూడి జత.. ఫౌజీని తెరకెక్కించే యత్నాలు!

5 months ago | 50 Views

టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరో అంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అని చెప్పక తప్పదు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు ఈ స్టార్‌ హీరో. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో 'సలార్‌ 2'తో పాటు కల్కి పార్ట్‌, రాజా సాబ్‌, స్పిరిట్‌ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు షూటింగ్‌ కంప్లీట్‌ చేయడానికి కనీసం ఇంకో సంవత్సరం అయిన పడుతుంది. అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్‌ మరో టాలీవుడ్‌ దర్శకుడికి ఒకే చెప్పిన విషయం తెలిసిందే, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్‌ హను రాఘవపూడితో 'ఫౌజీ’ అనే మూవీ ఒకే చేశాడు ప్రభాస్‌. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనుల్లో బిజీగా ఉండగా.. ఈ సినిమా అక్టోబర్‌ చివరి వారంలో లేదా, నవంబర్‌లో షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. 'యానిమల్‌' దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌ కాంబోలో వస్తున్న చిత్రం 'స్పిరిట్‌’.

ఈ సినిమాను మొదట 2024 చివరిలో షూటింగ్‌ ప్రారభించనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రకటించాడు. అయితే 'స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యం అవుతుండడంతో ఆ స్థానంలో 'ఫౌజీ’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు 'ఫౌజీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్‌ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్యాన్రికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారట. ఇందులో కథానాయికగా మృణాళ్‌ఠాకూర్‌ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.

ఇంకా చదవండి: నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబో.. హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అంటూ వార్తలు!

# Salaar2     # Prabhas     # Tollywood    

trending

View More