చిత్రసీమలో మరో పెళ్లి పెటాకులు... విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి వెల్లడి
3 months ago | 33 Views
నటుడు జయం రవి సంచలన ప్రకటన చేశారు. 15 ఏళ్ల వివాహ బంధానికి ఆయన స్వస్తి పలికారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన సోషల్ విూడియాలో పోస్ట్ పెట్టారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి నోట్‌లో తెలిపారు. జీవితం ఎన్నో అధ్యాయాల తో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. విూలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు విూ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా.
ఈ విషయాన్ని భారమైన హృదయంతో విూకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోలేదు. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని విూ అందరినీ కోరుతున్నాను. ఈ విషయంపై ఆరోపణలు మానేయాలని అందరినీ కోరుతున్నా, ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. విూ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ విూ జయం రవిగా విూ గుండెల్లో ఉంటా. ఎప్పటికీ ఇలానే సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా’ అని జయం రవి పేర్కొన్నారు.
ఇంకా చదవండి: యాక్షన్ డ్రామాగా 'దేవర' మూవీ.. సందీప్ వంగాతో ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై ర్యూమర్స్!
# JayamRavi # Aarthi