కోర్టు మెట్లు ఎక్కిన మరో సెలబ్రిటీ కపుల్స్!?
1 month ago | 5 Views
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కపుల్స్ డైవర్స్ సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక సౌత్ ఇండియాలోని చిన్న ఇండస్ట్రీ నుండి వచ్చి పాన్ ఇండియా వైడ్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఓ హీరో ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. విడాకుల విషయం కాకున్నా.. ఆ సెలబ్రిటీ కపుల్ కోర్టుకి వెళ్లి వింతండవాదం చేశారు. ఆ స్టార్ హీరోతో పాటు ఆమె కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఇంతకీ ఆ సెలబ్రిటీ కపుల్ ఎవరు.. వారి మధ్య ఏమైందంటే.. ‘కెజిఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్. అతని భార్య రాధికా పండిట్ కూడా హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
అయితే వీరిద్దరూ తాజాగా కోర్టు మెట్లెక్కారు. కానీ.. అది విడాకుల విషయమో, మరో గొడవో కాదు జస్ట్ యాడ్ కోసం. యశ్ లాయర్ ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ కోసం ఒక ప్రకటన చేశారు. ఇందులో యశ్ వైఫ్ రాధికా పండిట్ మోసపోయిన కస్టమర్ పాత్రలో నటించింది. కాగా కంపెనీ యొక్క నిజమైన వంట నూనెను నిరూపించడానికి యశ్ వాదించాడు. ఈ రియల్ లైఫ్ కపుల్ రీల్ లైఫ్ లో కూడా కలిసి నటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు యశ్.. తదుపరి చిత్రం ‘టాక్సిక్’.ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి, కరీనాకపూర్, శ్రుతిహాసన్, కియారా అడ్వాణీ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు హీరోయిన్‌గా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం భారీ సెట్లు వేశారు. అది కూడా ఫారెస్ట్ భూమిలో. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. యష్ నటిస్తున్న ఈ ‘టాక్సిక్’ మూవీ చిత్రం కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ప్రారంభమైంది. ఇక్కడ భారీ సెట్‌ను వేశారు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఆ భూమిలో చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాధికారులు అక్కడ దిగారు.
ఇంకా చదవండి: అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట!