నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తా: ఓటీటీ సిరీస్ 'బహిష్కరణ’ నటి అంజలి
5 months ago | 77 Views
వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అలరిస్తున్నారు నటి అంజలి. తాజాగా 'బహిష్కరణ’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇందులోని ఇంటిమేట్ సీన్స్‌పై స్పందించారు. ’కెరీర్ ప్రారంభం నుంచే నాకు మంచి పాత్రలు వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్ట్‌లనే ఎంచుకున్నాను. ప్రతీ సినిమాకు హోమ్ వర్క్ చేస్తాను. కొన్ని సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. యాక్షన్ సన్నివేశాలు కూడా డూప్ లేకుండా చేస్తాను. 'నవరస’ సిరీస్ చేసినప్పుడు కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు. 'బహిష్కరణ’లో ఇంటిమేట్ సన్నివేశాలు చేసే సమయంలో అందరినీ బయటకు పంపి వాటిని చిత్రీకరించారు. అయినా ఆ సీన్ చేసే సమయంలో కొంచెం గందరగోళానికి గురయ్యాను. ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి సినిమా. నా పాత్రకు నేను ఎంతవరకు న్యాయం చేయగలను అనేది నా చేతిలో ఉంటుంది. సినిమా ఫలితం విషయంలో నేనేం చేయలేను. నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది. సోషల్ విూడియాలో వచ్చే నెగెటివిటీ గురించి పట్టించుకోను. నా గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతాను. కానీ వెంటనే మర్చిపోతాను. ఇతరుల కోసం పనులు చేయడం మానేశాను. నా పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. అలా వస్తున్నాయని నేను పెళ్లి చేసుకోలేను కదా. సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను’ అని చెప్పారు.
ఇంకా చదవండి: ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు!
# Bahishkarana # Anjali # Ravindravijay