'యానిమల్‌'తో ప్రశంసలు ..విమర్శలూ ఎదుర్కొన్నా:  త్రిప్తి డిమ్రి

'యానిమల్‌'తో ప్రశంసలు ..విమర్శలూ ఎదుర్కొన్నా: త్రిప్తి డిమ్రి

2 months ago | 5 Views

'యానిమల్‌’తో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్ననటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి. తన తదుపరి చిత్రం 'విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 'యానిమల్‌’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. ఆ సినిమా వల్ల ఫేమ్‌ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అన్నారు. 'యానిమల్‌’ సినిమా విడుదలయ్యాక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. జోయాగా యాక్ట్‌ చేసినందుకు నన్ను చాలామంది తిట్టారు. సోషల్‌విూడియా వేదికగా పలువురు నెటిజన్లు అసభ్యంగా ట్రోల్‌ చేశారు. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో బాధపడ్డా. మానసికంగా ఆవేదనకు గురయ్యా. దానినుంచి బయటకు రావడం కోసం మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నా. దానివల్ల బాధ కాస్త తగ్గింది. మనసు శాంతించింది. ఆ సమయంలో నా సోదరి ఎంతో సపోర్ట్‌గా నిలిచింది.

'నువ్వు ఏం చేశావో నీకు తెలుసు. కాబట్టి ఇతరుల మాటలు పట్టించుకోకు' అని ధైర్యం చెప్పిందని తెలిపారు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం 'యానిమల్‌’. యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా  తెరకెక్కింది. జోయాగా అలరించారు త్రిప్తి డిమ్రి. కథలో భాగంగా ఆమెపై కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ చిత్రీకరించారు. ఆ సీన్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రిప్తికి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. 'నేషనల్‌ క్రష్‌’ అని ట్యాగ్‌ ఇచ్చారు. అభిమానులు చూపిస్తోన్న ప్రేమపై గతంలో ఓ సందర్భంలో మాట్లాడారామె. 'బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్‌ చేస్తానని కెరీర్‌ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు.'లైలా మజ్ను’ తర్వాత నటనలో శిక్షణ తీసుకొన్నా. ప్రేక్షకులు నా నటనతో కనెక్ట్‌ అవుతున్నారని చెప్పారు.

ఇంకా చదవండి: ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా దసరా ఉత్సవాలు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# TriptiDimri     # Bollywood