ఆ హీరో కోసం భారీ సినిమాను రిజక్ట్‌ చేసిన అనన్యపాండే

ఆ హీరో కోసం భారీ సినిమాను రిజక్ట్‌ చేసిన అనన్యపాండే

1 month ago | 5 Views

బాలీవుడ్‌ బ్యూటీ ‘‘ అనన్య పాండే ‘‘ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈమె.. తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది. 

Ananya Panday reveals she was not okay saying 'a lot of things' in Liger: I  am happy that I voiced my opinion | Bollywood - Hindustan Times

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్‌ అయినప్పటికీ డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో తెలుగులో మళ్లీ మరో సినిమాకు ఓకే చెప్పలేదు. రీసెంట్‌ గానే లైగర్‌ సినిమాను అనన్య అయిష్టంగానే ఒప్పుకుందని చుంకీ పాండే చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌ గా మారాయి.  ఇక ఇప్పుడు బాలీవుడ్‌ లో అనన్య పాండేకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈగర్‌ గా ఎదురుచూస్తుంటారు హీరోయిన్స్‌. ఇక పలువురు హీరోయిన్లు అయితే కొంతమంది స్టార్‌ హీరోలు, దర్శకుల సినిమాల కోసం ఈగర్‌ గా ఎదురుచూస్తుంటారు. కానీ కొన్ని సార్లు డేట్స్‌ అడ్జెస్ట్‌ అవ్వక ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను మిస్‌ చేసుకుంటారు. ఇప్పుడు అనన్య పాండే డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ తెరకెక్కిస్తున్న సినిమాలో ఆఫర్‌ వచ్చిందట. బాలీవుడ్‌ లో ఇంతియాజ్‌ అలీ ప్రేమకథలు తెరకెక్కించడంలో మంచి పేరుంది. ఇంతియాజ్‌ ఓ భారీ బడ్జెట్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌ గా అనన్యను అనుకున్నారట. అయితే కార్తీక్‌ ఆర్యన్‌ సినిమా షూటింగ్‌ లో ఆమె బిజీగా ఉండటంతో డేట్స్‌ అడ్జెస్ట్‌ కాక ఇంతియాజ్‌ అలీ సినిమాను రిజెక్ట్‌ చేసిందట.
ఇంకా చదవండి: హీరో కోసం కోట్ల ఆస్తిని రాసిచ్చింది..

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# విజయ్‌దేవరకొండ     # అనన్యపాండే    

trending

View More