'పొట్టేల్‌' ప్రమోషన్లలో అనన్య నాగళ్ల.. ఓ మంచి చిత్రం ..ఆదరించడని వినతి!

'పొట్టేల్‌' ప్రమోషన్లలో అనన్య నాగళ్ల.. ఓ మంచి చిత్రం ..ఆదరించడని వినతి!

2 months ago | 5 Views

 అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'పొట్టేల్‌’ అక్టోబర్‌ 25న విడుదల కానున్న  నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు అనన్య నాగళ్ల... కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా? అన్నప్రశ్న సామాజిక మాధ్యమాల వేదికగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఈ అంశంపై అనన్య మాట్లాడారు. ఇంత డైరెక్ట్‌గా వేదికపై ఉన్న నటిని సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. 'సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా’ అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నా.


'ఇండస్ట్రీలోకి  వెళ్లి కుటుంబం పరువు తీసేసింది’ అని కొందరు ఆలోచిస్తుంటారు. కానీ, 'పొట్టేల్‌’ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారనుకున్నా. 'ఇంత గొప్ప సినిమాలో మా అమ్మాయి నటించింద’ని మా అమ్మ అందరితో చెబుతారని చాలా ఆనందించాను. అలాంటప్పుడు ఈ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా.. కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు.  హీరోయిన్లు మేకప్‌ వేసుకుని.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండని అని  పేర్కొన్నారు.

# పొట్టేల్‌     # అనన్య నాగళ్ల     # సందీప్‌ రెడ్డి వంగా    

trending

View More