అభిమాని ఇంటిముందు అమితాబ్‌ విగ్రహం.. గూగుల్‌ గుర్తింపుతో వెలుగులోకి!

అభిమాని ఇంటిముందు అమితాబ్‌ విగ్రహం.. గూగుల్‌ గుర్తింపుతో వెలుగులోకి!

3 months ago | 38 Views

బాలీవుడ్‌ విలక్షణ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే! కొందరు అభిమానులు ఆయనపై ప్రత్యేక అభిమానం చాటుకుంటారు. కోల్‌కత్తాలోని శ్రీ ధార్‌ రాయ్‌ రోడ్‌ ప్రాంతంలో ఆయనకు గుడి కూడా కట్టారు. ఇప్పుడు మరో అభిమాని ఆయనపై ఉన్న ప్రేమాభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. న్యూజెర్సీకి చెందిన గోపీసేథ్‌  దాదాపు రెండేళ్లక్రితం తన నివాసం ఎదుట అమితాబ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. రెండేళ్ల తర్వాత ఇది గూగుల్‌ గుర్తింపు పొందింది. పర్యాటక ప్రాంతంగా గూగుల్‌ దీనిని గుర్తించింది. ఈ విషయంపై గోపీసేథ్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘మా నివాసం ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. దానికి కారణమైన అమితాబ్‌ విగ్రహానికి ధన్యవాదాలు.

గూగుల్‌ గుర్తింపు కారణంగా రోజురోజుకీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. అమితాబ్‌ తమలో ఏవిధంగా స్ఫూర్తి నింపారో తెలియజేస్తూ పలువురు గ్రీటింగ్‌ కార్డులు వదిలివెళ్తున్నారు.ఇక్కడికి వచ్చిన చాలామంది ఫ్యాన్స్‌  విగ్రహంతో ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అలా మా ఈ ప్రాంతానికి మరింత ప్రజాదరణ సొంతమైంది‘ అని గోపీసేథ్‌ తెలిపారు. ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త గోపీ న్యూజెర్సీలోని ఎడిసన్‌ సిటీలో నివాసం ఉంటున్నాడు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులకూ బచ్చన్‌  అంటే అభిమానం. అందులో భాగంగానే 2022లో తన ఇంటి ముందు అమితాబ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. ‘1991లో తొలిసారి అమితాబ్‌ను కలిశా. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిని అయ్యా. నా కుటుంబానికి ఆయన దేవుడితో సమానం. ఆయన నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. అందుకే నా ఇంటిముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశా‘ అని ఓ సందర్భంలో ఆయన తెలిపారు.

ఇంకా చదవండి: నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ కన్నుమూత!

# AmitabhBachchan     # Rekha     # Bollywood    

trending

View More