అంబానీ ఇంట పెళ్లి సందడి.. స్టెప్పులేసిన సినీ, క్రికెట్ తారలు
5 months ago | 50 Views
ప్రముఖ పారిశ్రామివేత్త ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు అతిథుల సమక్షంలో వధువు రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా అంబానీ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథులతో కలిసి వాళ్లు డ్యాన్స్ చేశారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు తమ డ్యాన్స్‌తో అలరించారు.
డీజే పాటలు, ప్రముఖుల నృత్యాలతో ఈ కల్యాణోత్సవా నికి వేదిక అయిన 'జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సందడిసందడిగా మారింది. ఆ సందడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ విూడిలో వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, మహేశ్ బాబు, రణ్‌బీర్ కపూర్, సూర్య, ఎమ్ ఎస్ ధోనీ సహా పలువురు స్టార్స్ తమ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్‌లో స్టార్స్ అంతా మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. రజినీకాంత్ నుంచి స్టార్ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ వరకూ ప్రతి ఒక్కరూ బరాత్‌లో కాలు కదిపి ఆకట్టుకున్నారు. రజినీకాంత్, షారుక్ ఖాన్, అలియా భట్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, ఎమ్‌ఎస్ ధోనీ సహా స్టార్సంతా ఉత్సాహంగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంకా చదవండి: మమ్ముట్టితో జతకట్టిన నయనతార!
# MukeshAmbani # NitaAmbani # AnantAmbani # TeluguCinema