అమర్‌ సింగ్‌ చంకీల కోసం 16 కిలోల బరువు పెరిగా...

అమర్‌ సింగ్‌ చంకీల కోసం 16 కిలోల బరువు పెరిగా...

3 days ago | 10 Views

ఇటీవల విడుదలైన 'అమర్‌ సింగ్‌ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా. ఈ సినిమా కోసం ఆమె 16 కిలోల బరువు పెరిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఎంతమంది హీరోయిన్లు ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. 'కెరీర్‌ ప్రారంభంలో సరైన కథలను ఎంపిక చేసుకోలేకపోయాను. ప్రేక్షకులు నా నుంచి మంచి పాత్రలను కోరుకుంటున్నారని అర్థమైంది. దానికోసం హోం వర్క్‌ చేయాలని నిర్ణయించుకున్నా. సవాళ్లతో కూడిన కథలను ఎంచుకోవడం ప్రారంభించాను. అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. 'అమర్‌ సింగ్‌ చంకీల’ కోసం నేను 16 కిలోల బరువు పెరిగాను. ఎంతమంది ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారు?.

ఈరోజుల్లో ఇలాంటి సాహసం తక్కువమంది హీరోయిన్లు చేస్తారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒకరో, ఇద్దరో దీనికి అంగీకరిస్తారు. అంకితభావం, నిబద్ధత కలిగిన హీరోయిన్లు మాత్రమే ఇలా చేయగలరు. ఈ చిత్రం నాకు అసాధారణ ప్రయాణం. లైవ్‌లో ఎలా పాడాలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. రిస్క్‌ తీసుకున్నాను కాబట్టే చిత్రం విజయం సాధించింది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పారు. ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టారు నటి పరిణీతి చోప్రా. 2011లో విడుదలైన 'లేడీస్‌ వర్సెస్‌ రికీ బప్ల్’లో కీలక పాత్ర పోషించారు. 'కిల్‌ దిల్‌’, 'డిష్యూం’,'గోల్‌మాల్‌ అగైన్‌’, 'కేసరి’, 'సైనా’ వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా ప్రేక్షకులను అలరించారు. ఇటీవల'అమర్‌ సింగ్‌ చంకీల’తో హిట్‌ను సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి: స్టార్ మా లో వినోదాల విందు కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్

# Chamkila     # Diljit Dosanjh     # Parineeti Chopra     # Nisha Bano