పవన్‌ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ... సినీ రాజకీయ ప్రముఖుల  అభినందనలు... డిప్యూటి సిఎం అంటూ అల్లు అర్జున్‌ విషెస్‌

పవన్‌ కళ్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ... సినీ రాజకీయ ప్రముఖుల అభినందనలు... డిప్యూటి సిఎం అంటూ అల్లు అర్జున్‌ విషెస్‌

3 months ago | 36 Views

నటుడు, ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌విూడియా వేదికగా శుభాకాంక్షలు  చెప్పారు. ఇందులో భాగంగా నటుడు అల్లు అర్జున్‌ తాజాగా విషెస్‌ తెలుపుతూ ఎక్స్‌ లో పోస్ట్‌ పెట్టారు. 'హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, మన పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకంక్షలని దర్శకేందరుడు రాఘవేంద్రరావు తెలిపారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై విూకున్న అంకితభావం, పట్టుదల అభినందనీయం. విూరు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గొప్ప స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజాసేవలో నిమగ్నమైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన విూ ప్రస్థానం ఒక అధ్యాయం. రాజకీయ ప్రయాణంలో విూ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో విూరు వేసిన అడుగులు చరిత్రాత్మకం. ప్రజా నాయకుడిగా విూరు మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్రమంత్రి చంద్రశేఖర్‌ పెమ్మసాని అన్నారు.  ‘సంకల్పమే బలం, జనహితమే ధ్యేయంగా.. జన సంక్షేమం కోసం తపిస్తున్న జనసేన అధినేత, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ కొండగట్టు ఆంజనేయస్వామి కృపతో ఎల్లప్పుడూ ప్రజా సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లురో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. వన్‌ అండ్‌ ఓన్లీ పవర్‌స్టార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.  విూరు మరెన్నో విజయాలు అందుకోవాలని.. ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. వినయం, అంకితభావంతో విూరు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాగే ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నానని నిర్మాత బన్నీ వాస్‌ అన్నారు. ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకం.

ఎందుకంటే జెండా పట్టిన జనసైనికులకు, నమ్మి నడిచిన నాయకులకు, నువ్వు వస్తే మార్పు తెస్తావ్‌ అని ఎదురుచూసే నాలాంటి ఎంతోమందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి. ఉన్నత విలువలున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని అంటూ అన్న నాగబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన నాయకుడు.. ఎన్నో లక్షల మంది ఆశాకిరణం.. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హ్యాపీ బర్త్‌డే కోట్లాది మంది ప్రేమ, ఆశీస్సులు విూకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు మెహర్‌ రమేశ్‌ ప్రకటించారు. ఇతడే మన కల్యాణ్‌ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ ఎదిగిన విూ చరిత్ర అనితర సాధ్యం  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విూ తీరు ఆచరణీయం. అన్నయ్యకు తమ్ముడిగా మొదలై లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన విూరు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి. కథానాయకుడిగా గెలిచి ప్రజల నాయకుడిగా నిలిచిన విూ జీవితం స్ఫూర్తి దాయకం. హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌ అని ఎస్‌కెఎన్‌ అన్నారు.

ఇంకా చదవండి: తమ్ముడు పవన్‌కల్యాణ్‌ కు అన్న చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు..

# PawanKalyan     # Alluarjun     # Birthday    

trending

View More