షారుఖ్‌ఖాన్‌ రికార్డు బద్దలుకొట్టిన అల్లుఅర్జున్‌!?

షారుఖ్‌ఖాన్‌ రికార్డు బద్దలుకొట్టిన అల్లుఅర్జున్‌!?

10 days ago | 5 Views

అల్లు అర్జున్‌ -సుకుమార్‌ కాంపౌండ్‌ నుంచి వచ్చిన మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ 'పుష్ప 2 ది రూల్‌'. ఈ పాన్‌ ఇండియా సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై రికార్డుల వేట మొదలుపెట్టింది. 'పుష్ప 2 ది రూల్‌' రిలీజైన  అన్ని సెంటర్లలో దాదాపు హౌస్‌ఫుల్‌ షోలతో విజయవంతంగా స్క్రీనింగ్‌ అవుతోంది. ఇప్పటికే ఓపెనింగ్‌ డే రోజున నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ.30 కోట్లు షేర్‌ రాబట్టి.. ఆర్‌ఆర్‌ఆర్‌ (రూ.23.38 కోట్లు)పై ఉన్న రికార్డును అధిగమించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకుందని బీటౌన్‌ సర్కిల్‌ కథనం.

Pushpa 2 Box Office Day 3: Allu Arjun Starrer Continues Record-breaking  Streak, Collects Rs 500 Cr - News18

జవాన్‌ ఫస్ట్‌ డే రూ.65 కోట్లు వసూళ్లు రాబట్టగా.. పుష్ప 2 రూ.67 కోట్లతో రికార్డ్‌ను బీట్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ లెక్కన పుష్ప 2 బాక్సాఫీస్‌ రికార్డుల మోత ఖాయమని పుష్పరాజ్‌ చెప్పకనే చెబుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సీక్వెల్‌లో ఫహద్‌ ఫాసిల్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇంకా చదవండి: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ స్పీడ్‌కు బ్రేక్‌ వేసిన హాలీవుడ్‌!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అల్లుఅర్జున్‌     # పుష్ప2దిరూల్‌     # షారుఖ్‌ఖాన్‌     # జవాన్‌    

trending

View More