మంచి ఛాన్స్‌ వదులుకున్న అల్లు అర్జున్‌..!

మంచి ఛాన్స్‌ వదులుకున్న అల్లు అర్జున్‌..!

4 months ago | 35 Views

అల్లు అర్జున్‌ ఏదైనా ఈవెంట్‌ లో పాల్గొంటే చాలు ఆయన ఏం మాట్లాడతాడో అని ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మెగా వర్సెస్‌ అల్లు అంటూ ఫ్యాన్స్‌ మధ్య జరుగుతున్న ఈ గొడవల గురించి ఆయన ఏదైనా స్పందిస్తారా అని ఎదురుచూస్తారు. లేటెస్ట్‌ గా సుకుమార్‌ వైఫ్‌ తబిత సమర్పణలో రావు రమేష్‌ లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన 'మారుతి నగర్‌ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు అల్లు అర్జున్‌ గెస్ట్‌ గా వచ్చాడు. తను మైక్‌ అందుకున్న ప్రతిసారీ తన ఆర్మీ గురించి చెప్పడం కామనే. ఈసారి కూడా స్పీచ్‌ లో తన ఫ్యాన్స్‌ ని బంగారం అంటూ వారిని ఖుషి చేశాడు అల్లు అర్జున్‌. ఐతే ఈ ఈవెంట్‌ లో అల్లు అర్జున్‌ ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడని చెప్పొచ్చు.

అదెలా అంటే ఎలాగు ఈవెంట్‌ సొంత వాళ్లదే అన్నట్టు కాబట్టి ఈవెంట్‌ లో నేడు జరుపుకునే మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే గురించి ప్రస్తావించి ఒక మెగా విష్‌ అందిస్తే సరిపోయేది. అల్లు అర్జున్‌ ఎంత పెద్ద స్టార్‌ అయినా చిరంజీవికి అభిమానే కాబట్టి మెగా ఫ్యాన్స్‌ అతన్ని ఎటాక్‌ చేయడం గురించి ఆలోచించే వారు. అలా కాకుండా ఈవెంట్‌ లో హీరోలను చూసి హీరో అయిన వాళ్లు ఉన్నారు. కానీ ఫ్యాన్స్‌ ని చూసి హీరో అయ్యానంటూ అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన ఫ్రెండ్స్‌ కోసం తాను నిలబడతానని.. వారి కోసం ఎక్కడికైనా వెళ్తానని చెప్పాడు.

అంటే ఇన్‌ డైరెక్ట్‌ గా అల్లు అర్జున్‌ తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవి కోసం వెళ్లడం గురించి మళ్లీ చెప్పుకొచ్చాడని ఆడియన్స్‌ కు అర్థమైంది. అసలే సోషల్‌ మీడియాలో ఈ ఇష్యూపై మెగా, పవర్‌ ఫ్యాన్స్‌ అంతా గరం గరంగా ఉంటే ఇప్పుడు మళ్లీ స్నేహితుల కోసం నేను నిలబడతా అని అల్లు అర్జున్‌ చెప్పడంపై ఆయన ఏం చెప్పదలచుకున్నాడో అర్థమైంది. ఐతే నిన్న ఈవెంట్‌ లో మర్చిపోయాడా లేదా కావాలని స్కిప్‌ చేశాడా అన్నది పక్కన పెడితే  చిరు బర్త్‌ డే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు అల్లు అర్జున్‌. చిరు అభిమాని అన్నది నైట్‌ ఈవెంట్‌ లో గుర్తురాలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఐతే వాళ్ల మధ్య ఏం జరుగుతుంది ఏంటి అన్నది పక్కన పెడితే.. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ విషయంలో చేస్తున్న కామెంట్స్‌ మాత్రం మెగా ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యేలా చేస్తున్నాయి. మరి ఈ గొడవకు ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు ఎవరు పెడతారన్నది చూడాలి మరి!

ఇంకా చదవండి: 'మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం’.. సరైన టైమ్‌ లో బూస్ట్‌ ఇచ్చిన బన్నీ

# AlluArjun     # HrithikRoshan    

trending

View More