యూట్యూబ్ ఛానళ్లపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి!?
1 month ago | 5 Views
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళలో సోషల్ మీడీయాలో హీట్ పెరిగిపోతుంది. ఒకవైపు మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ వేదికగా బాలయ్యతో క్లారిటీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బన్నీ ఫ్యాన్స్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌పై దాడి చేశారు. ఎందుకంటే.. సోమవారం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేశారు.
ఈ దాడిలో ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు ఇతర సామాగ్రి ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పై ఉద్దేశపూర్వకంగా నీచమైన థంబ్స్‌తో వీడియోలు పెడుతున్నారని అందుకే ఈ దాడి చేశామని ఫ్యాన్స్ ప్రకటించారు. ఒక వీడియోలో ఏకంగా చావు, బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్ అని థంబ్ పెట్టడంపై సీరియస్ అయ్యారు. అయితే వ్యక్తులపై ఎలాంటి భౌతిక దాడులు ఈ ఘటనలో చోటుచేసుకోలేదు. మళ్ళీ.. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఫ్యాన్స్ హెచ్చరించారు.
ఇంకా చదవండి: ఆలియా భట్ ప్రధాన పాత్రగా లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ తో రానున్న నాగ్ అశ్విన్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్ప2 # అల్లుఅర్జున్ # యూట్యూబ్