తెలుగు సినిమా అంతా నా వెనక నిలబడింది : నాగ్‌

తెలుగు సినిమా అంతా నా వెనక నిలబడింది : నాగ్‌

2 months ago | 5 Views

'నేను ఎప్పుడూ కూడా చాలా బలమైన వ్యక్తినని అనుకుంటూ ఉంటాను. ఇక నా కుటుంబ రక్షణ విషయానికి వస్తే, నేనొక సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. ఇది మా నాన్నగారి గొప్పతనం, ఆశీస్సులుగా భావిస్తున్నాను అంటూ తాజాగా కింగ్‌ నాగార్జున నుండి ఓ మెసేజ్‌ వచ్చింది.

Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ..  తేడా తెలిసిందా నాగ్ | Nagarjuna Sensational Post on Tollywood Support in  Konda Surekha Issue KBK

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద కామెంట్స్‌ ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే. కేటీఆర్‌ని టార్గెట్  చేసే క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీపై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ అంతా రెస్పాండ్‌ అయింది. అక్కినేని ఫ్యామిలీనే కాదు.. మొట్టమొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ  కూడా ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖ కామెంట్స్‌ని ఖండించారు. కొందరైతే ఆమెపై ధ్వజమెత్తారు కూడా. ఈ విషయంపై  మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా కూడా వేశారు. అయితే.. కింగ్‌ నాగార్జునకు ఇండస్ట్రీ  మొత్తం సపోర్ట్‌ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇదే నాగార్జున గతంలో ఒకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాలలో ఉన్నప్పుడు చేసిన కొన్ని కామెంట్స్‌ని నెటిజన్లు బయటికి తీస్తున్నారు. ఏపీకి వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టాడో తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల విషయంలో దారుణంగా ప్రవర్తించి, సామాన్యుడికి వినోదం అందాలంటూ నానా యాగీ చేశారు. ఆ టైమ్‌లో నాగార్జున సినిమా విడుదలవుతుండగా.. ఓ రిపోర్టర్‌లో ఈ టికెట్ల ధరలతో విూకు ఇబ్బంది లేదా? అంటే నాకేం ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఆ టికెట్ల ధరలు ఓకే అంటూ.. ఇండస్ట్రీ  అంతా ఇబ్బంది పడుతున్న సమయంలో నా దారి నాదే అనేలా స్పందించారు. ఇప్పుడదే వీడియోను నెటిజన్లు సోషల్‌ విూడియాలో వైరల్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి: రజనీ ఆరోగ్యమే మాకు ముఖ్యం: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Nagarjuna     # KondaSurekha     # Telugufilmindustry    

trending

View More