ఫ్యాషన్ వీక్‌లో తళుక్కుమన్న ఆలియా, ఐశ్వర్యా!
3 months ago | 40 Views
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్ ఘనంగా సాగుతోంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన అందాల తారల సొగసుల సౌందర్యంతో లవ్ సిటీ మైమరచి కైపెక్కిపోయింది. భారత్ నుండి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్‌తో పాటు బాలీవుడ్ తార అలియా భట్ తళుక్కుమనిపించారు. ఈ ఏడాది న్యూ యార్క్‌లో నిర్వహించిన మెట్ గాలాలో తన ఔట్ ఫిట్‌తో ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షించిన అలియా భట్ తొలిసారి ఫాషన్ వీక్‌లో అందరి దృష్టి ఆకర్షించింది.
మెటాలిక్ డ్రెస్‌లో ఆమె ర్యాంప్‌పై సోలో గాను అగ్రతారలు కెండల్ జెన్నర్, జేన్ ఫోండా, కారా డెలివింగ్నే మరియు ఐశ్వర్య రాయ్‌లతో కలిసి రోజ్ షో చేశారు. మరో వైపు ఐశ్వర్య రాయ్ రెడ్ బబుల్ గౌనులో సూపర్ ఎలిగెంట్‌గా కనిపించారు. ఇలా ఈ ఇద్దరు తమదైన ఫాషన్ స్టేట్‌మెంట్ పాస్ చేశారు. కాగా, పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన ఐశ్వర్య చివరిగా పొన్నియన్ సెల్వన్ లో కనిపించారు. మరోవైపు అలియా భట్ ఈ వారంలో జిగ్ర మూవీతో రానుంది.
ఇంకా చదవండి: ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే 'దేవర' కథ : దర్శకుడు కొరటాల శివ
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# AliaBhatt # AishwaryaRaiBachchan # Bollywood