అక్కినేనికి అఖిల్‌  కాలం కలిసొచ్చేనా!?

అక్కినేనికి అఖిల్‌ కాలం కలిసొచ్చేనా!?

4 months ago | 35 Views

 హీరోగా అఖిల్‌ అక్కినేనికి కాలం కలిసి రావడం లేదు. చిన్నప్పుడు చేసిన 'సిసింద్రీ’, గెస్ట్‌ అప్పీరియెన్స్‌ ఇచ్చిన  'మనం’ మినహా.. అఖిల్‌కు చెప్పుకోవడానికి సరైన హిట్‌ ఇంత వరకు పడలేదనే చెప్పుకోవాలి. ఎలాగైనా అఖిల్‌కి ఓ బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలని తండ్రి నాగార్జున చేయని ప్రయత్నాలు లేవు. భారీ  బడ్జెట్‌తో తెరకెక్కి, ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'ఏజెంట్‌’ మూవీ కూడా అఖిల్‌కు సక్సెస్‌ని ఇవ్వలేకపోయింది. ఆ సినిమా వచ్చి సంవత్సరం పూర్తయినా.. ఇంత వరకు అఖిల్‌ తర్వాత సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదంటే.. అఖిల్‌ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఎంత డైలామాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు అఖిల్‌ కు ఎలాంటి సినిమా పడాలి? అఖిల్‌ని ఎలా ప్రేక్షకులలో నిలబెట్టాలి? అనే ఆలోచనలో ఉన్న అక్కినేని ఫ్యామిలీ.. చివరకు  ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ చేయబోయే తదుపరి సినిమా కోసం.. కింగ్‌ నాగార్జునతో పాటు యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య కూడా రంగంలోకి దిగబోతున్నట్లుగా టాలీవుడ్‌లో టాక్‌ వినబడుతోంది.

నాగార్జున, నాగచైతన్యలు.. అఖిల్‌ తదుపరి సినిమాను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్‌ రానుందనేలా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినబడుతున్నాయి. వాస్తవానికి 'ఏజెంట్‌’ తర్వాత అఖిల్‌ చేయబోయే సినిమా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళుతున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్‌ ఇంత వరకు రాలేదు. ఆ ప్రాజెక్ట్‌ సంగతి ఏమోగానీ.. ఇప్పుడు ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్‌తో సినిమా చేసేందుకు నాగార్జునతో పాటు, నాగ చైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కిరణ్‌ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి హిట్టు సినిమా తీసిన మురళీ కిషోర్‌ చెప్పిన కథ నచ్చడంతో..

అఖిల్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉండబోతుందని, ఈ సినిమాకు 'లెనిన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతా సెట్టయితే.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు అనుబంధంగా మనం ఎంటర్‌ప్రైజెస్‌ అనే బ్యానర్‌లో ఈ సినిమాను నాగార్జున, చైతన్య నిర్మించాలని చూస్తున్నారని టాక్‌. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా చదవండి: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేరళ రాయల్ క్లాన్ తో ఆక‌ట్టుకున్న నటి పూనమ్ కౌర్

# AkhilAkkineni     # Tollywood    

trending

View More