చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం .. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం
1 month ago | 5 Views
మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారని తెలిసిందే. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనుంది. 2024 కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఆహ్వానం అందించాడు అక్కినేని నాగార్జున. చిరంజీవిని కలిసి అవార్డ్ సెర్మనీకి రావాల్సిందిగా ఆహ్వానపత్రికను అందించాడు నాగార్జున. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రెండేళ్లకోసారి ఏఎన్నార్ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
ఇంకా చదవండి: 42 ఏళ్ల అమ్మాయితో అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం..!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# చిరంజీవి # నాగార్జున