ఆకాశ్ పూరీ..ఇకనుంచి ఆకాశ్ జగన్నాథ్!
4 months ago | 40 Views
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరును ఆకాశ్ జగన్నాధ్‌గా మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈవిషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని.. ఆకాశ్ జగన్నాథ్ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త పేరు.. కెరీర్ పరంగా ఆయన నూతన విజయాలు అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
ఉన్నట్టుండి ఆకాశ్ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేదు. పూరీ జగన్నాథ్ తనయుడిగా ఆకాశ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'చిరుత’, ’బుజ్జిగాడు’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా అలరించారు. ’ఆంధ్రాపోరీ’తో హీరోగా మారారు. ఆ తర్వాత ’మెహబూబా’, ’రొమాంటిక్’, ’చోర్ బజార్’ సినిమాల్లో నటించారు. ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి.
ఇంకా చదవండి: 'పుష్పా-2' ఆలస్యం అయినా ..అంచనాలు మించుతుంది.. నటుడు అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్!
# AkashPuri # Tollywood