ఐశ్వర్య లక్ష్మి లుక్‌ నెట్టింట వైరల్‌ !

ఐశ్వర్య లక్ష్మి లుక్‌ నెట్టింట వైరల్‌ !

10 days ago | 14 Views

 సాయి దుర్గ తేజ్‌ హనుమాన్‌ మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ రోహిత్‌ కేపీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. మేకర్స్‌ చాలా రోజుల తర్వాత కొత్త అప్‌డేట్‌ అందించారు.  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఐశ్వర్యలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వసంత పాత్ర లుక్‌ షేర్‌ చేశారు.

నిర్మానుష్య ప్రదేశంలో కనిపిస్తున్న ఐశ్వర్య లక్ష్మి లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో సాయి తేజ్‌ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు ఫిలిం నగర్‌ సర్కిల్‌ టాక్‌. ప్రస్తుతం ఈమూవీ  షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది.

ఇంకా చదవండి: మనం ముందు జాగ్రత్త పడాలి.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆదాశర్మ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# SaiDharamTej     # AishwaryaLekshmi     # Tollywood    

trending

View More