నటీమణులు ధైర్యంగా ఉండాలి..  పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి: నటి ఐశ్వర్య రాజేశ్‌

నటీమణులు ధైర్యంగా ఉండాలి.. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి: నటి ఐశ్వర్య రాజేశ్‌

2 days ago | 15 Views

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ వైరల్‌గా మారిన తరుణంలో చిత్ర పరిశ్రమలో వేధింపులపై నటి ఐశ్వర్య రాజేశ్‌  స్పందించారు. నటీమణులు ధైర్యంగా ఉండాలని తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరిగాయి. చిత్ర పరిశ్రమలో నేను ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. వేధింపులకు పాల్పడిన దోషులకు సరైన శిక్ష పడాలి. చిత్ర పరిశ్రమకు సంబంధించి మహిళలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. విూరు ధైర్యంగా ఉండండి. చొరవ తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే స్పందించండి. గట్టిగా విూ స్వరాన్ని వినిపించండని తెలిపారు.

అవుట్‌డోర్‌ షూట్స్‌కు వెళ్లినప్పుడు సరైన వసతుల్లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని.. టాయిలెట్స్‌ కూడా సరిగ్గా ఉండటం లేదని ఆమె వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు  ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఇదే తరహా కమిటీని అన్ని చిత్ర పరిశ్రమల్లో ఏర్పాటుచేయాలని నటీనటులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి రోహిణి అధ్యక్షతన కోలీవుడ్‌లో ఓ కమిటీ ఏర్పాటు అయింది. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా తమ వద్దకువస్తే.. ఆ ఫిర్యాదును సైబర్‌ పోలీస్‌ విభాగానికి అందజేస్తామని రోహిణి తెలిపారు. దోషిగా తేలినవారిని దాదాపు ఐదేళ్లు కోలీవుడ్‌ నుంచి బ్యాన్‌ చేస్తామని అన్నారు.

ఇంకా చదవండి: నటనకు ప్రాణం పోసిన అక్కినేని!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# HemaCommittee     # AishwaryaRajesh