పెళ్లి పనులతో నటి శోభిత బిజీ... మొదలైన హల్దీ కార్యక్రమం!!
1 month ago | 5 Views
తెలుగు నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు మొదలుపెట్టింది. టాలీవుడ్ నటుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. సమంతతో విడిపోయిన అనంతరం శోభితాతో ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. రీసెంట్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. నవంబర్‌లో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తన పెళ్లికి సంబంధించి ఇప్పటినుంచే పనులు మొదలు పెట్టింది ఈ భామ. తాజాగా తన హల్దీ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి వైజాగ్‌లోని తన ఇంట్లో పసుపు దంచుతున్న ఫొటోలను సోషల్ విూడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. అయితే పసుపు దంచడం దగ్గరికి వచ్చిందంటే పెళ్లి కూడా త్వరలోనే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. లవ్ సితార అంటూ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది శోభితా ధూళిపాళ్ల. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నాగ చైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం చందూ మొండేటితో 'తండేల్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.