అబుదాబి వేదికగా ఐఫా వేడుకల్లో నటి రేఖ ప్రత్యేక నృత్యప్రద్శన
2 months ago | 5 Views
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగనుంది. ఈ సినీ పండగ ఐఫా 2024 కోసం ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సీనియర్ నటి రేఖ నృత్య ప్రదర్శన ప్రత్యేకం కానుంది. ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే రేఖ ఈ ఏడాది కూడా ప్రత్యేకత చాటుకోనున్నారు. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై డ్యాన్స్ చేయనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఐఫాకు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది.
అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతను చాటడం నాకు లభించిన ఓ అవకాశం. ఇంత గొప్ప ఫెస్టివల్‌లో మరోసారి భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఐఫా 24వ ఎడిషన్‌లో విూ అందరితో కలిసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఎదురుచూస్తున్నాను. ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనిది’ అని చెప్పారు. ఈ ప్రదర్శనకు ఆమె మనీష్ మల్హోత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యాస్టూమ్‌ను ధరించనున్నారు.ఈ ఏడాది జరగనున్న ఐఫా వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. షారుక్ ఖాన్, కరణ్ జోహర్, విక్కీ కౌశల్ ఈ ఈవెంట్‌లో యాంకర్లుగా సందడి చేయనున్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో పాటు మరికొందరు అగ్ర తారలు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
ఇంకా చదవండి: హాలీవుడ్ స్థాయిలో 'దేవర' నిర్మాణం!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# IIFA2024 # Rekha # ShahidKapoor