పిల్లల కోసమే నటనకు దూరంగా ఉన్నా: నటి రంభ మనసులో మాట
23 days ago | 5 Views
హీరోయిన్ రంభ సినిమాలకు దూరమై 15 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పిల్లల కోసం ఇంతకాలం పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. వివాహం అనంతరం కెనడాలో స్థిరపడినట్లు వెల్లడించారు.
ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నా పిల్లలకు ఒక వయసు వచ్చేవరకూ తల్లిగా పూర్తి బాధ్యత తీసుకున్నాను. వారిని దగ్గరుండి చూసుకున్నాను. ఇప్పుడు మా బాబుకు 6 ఏళ్లు. కుమార్తెలకు 14, 10 ఏళ్లు. వాళ్లు ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకుండా పనులు చేసుకుంటున్నారు. వాళ్లను చూసుకోవడం కోసమే నేను ఇన్నేళ్లు సినిమాలకు దూరమయ్యాను. కానీ, నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి నా భర్తకు తెలుసు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు అంగీకరించానని వివరించారు. మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా భయపడ్డానో ఇటీవల ఈ కార్యక్రమం కోసం డ్యాన్స్ వేసినప్పుడు అంతే భయపడ్డాను.
వ్యాన్‌లో నుంచి కిందకు రావడానికి కూడా సంకోచించాను. కానీ, ఒక్కసారి స్టేజ్ విూద డ్యాన్స్ వేశాక అందరి చప్పట్లు నాలో భయాన్ని పోగొట్టాయి. 30 ఏళ్ల క్రితం మేజిక్ మరోసారి రిపీట్ అయిందన్నారు. ఇటీవల ఒక ప్రారంభోత్సవానికి వచ్చాను. అక్కడి జనాలు నాపై ఎంతో ఆదరణ చూపారు. వారు నన్ను ఆదరించిన తీరు చూసిన తర్వాత నాకు సినిమాలపై మరోసారి ఆసక్తి కలిగింది. 15 ఏళ్లు దూరమైనప్పటికీ నటన నా రక్తంలోనే ఉంది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది నేటికీ నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నానని నటిరంభ వివరించారు.
ఇంకా చదవండి: రావణ పాత్ర కోసంయశ్ కసరత్తు!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!