నటి పావని కరణంకు ట్రోలింగ్ సెగ
5 hours ago | 5 Views
'పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర స్వభావాన్ని మార్చి సినిమాలో బిగ్ ట్విస్ట్ తెప్పించిన నటి పావని కరణం. అజయ్ కూతురిగా పుష్పరాజ్ ని చిన్నాయన అంటూ పిలుస్తూ కావేరి పాత్రలో అలరించిన ఆమెకు ప్రస్తుతం ట్రోలింగ్ సెగ తగులుతుంది. సినిమాలో ఆమెపై చేయేస్తేనే ప్రాణాలు తీసిన పుష్పరాజ్ రియల్ లైఫ్‌లో అయితే రాలేడు కదా! ఇంతకీ ఏం జరిగిందంటే.. మంచి థియేటర్ యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పావనిని చూసి సుక్కు ఇంప్రెస్స్ అయ్యి ఆమెకు పుష్ప ఫ్రాంచైజీ లో చోటు కల్పించాడు. అంతకు ముందు ఆమె తిరువీర్ ‘పరేషాన్’ మూవీలో ఫిమేల్ లీడ్‌గా కనిపిచింది. ప్రస్తుతం కావేరిగా ఫేమస్ అయినా ‘సమోసా తింటవా శిరీషా’ ఐకానిక్ డైలాగ్ తో అందరికి పరిచయమే. అయితే ‘పుష్ప 2’తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఆమె వరుస పోస్టులతో సుకుమార్‌కి, అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఒకటి, రెండు పోస్ట్‌లు వరకు ఓపిక పట్టిన నెటిజన్లు ఆ పోస్టులు కాస్త 4, 5 కావడంతో చిరాకు పడుతున్నారు. దీంతో ఆమె పోస్టుల క్రింద ఇక ఆపేయ్ చిరాకు వేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. కావేరి పాత్రను పార్ట్ 1లోనే లేపేసి ఉంటే మాకు ఈ నస తప్పేది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: ప్రైవేసీ ఇవ్వండి : విజయ్‌దేవరకొండ
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పావని # అల్లు అర్జున్