'వాళై' చిత్రంతో అద్భుత నటన.. దర్శకుడి ప్రతిభ అంటున్న నటి నిఖిలా విమల్
2 months ago | 5 Views
తాను ఒక పరికరాన్ని మాత్రమేనని, దర్శకుడు తనకు నచ్చిన రీతిలో మలచుకున్నారని హీరోయిన్ నిఖిలా విమల్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఆయన స్వీయ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'వాళై’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో పూంగొడి టీచర్‌గా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నిఖిలా విమల్ చిత్రంలో నటించిన తన అనుభవం, పూంగొడి టీచర్ పాత్రను దర్శకుడు మలిచిన తీరు వర్ణించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'వాళై’ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం.
ఆ పాత్రకు తగినట్టుగా దర్శకుడు నన్ను మలుచు కున్నారన్నారు. నేను ఒక పరికరాన్ని మాత్రమే. 'కర్ణన్’ చిత్రంలో హీరోయిన్ రజీషా విజయన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చెన్నైకి రాగా.. ఆ సమయంలోనే 'వాళై’ చిత్రం గురించి దర్శకుడు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చిత్రాన్ని నిర్మించి, అందులో నా కెరీర్‌లో నిలిచిపోయే పాత్రను ఇచ్చిన దర్శకుడికి రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డైరెక్టర్ కొడుకు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Vaazhai # NikhilaVimal # Rajisha