మొహమంతా రక్తంతో నటి అనసూయ

మొహమంతా రక్తంతో నటి అనసూయ

4 months ago | 39 Views

టాలీవుడ్‌ అనసూయ యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టి ఏకంగా స్టార్‌ నటిగా ఎదిగింది. పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 'పుష్ప-2'లోనూ నటిస్తోన్న అనసూయ.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సింబా'. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన సోషల్‌ విూడియా ఖాతాలో షేర్‌ చేసింది. మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించిన సింబాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. మొహమంతా రక్తంతో తడిసి ఉన్న ఫోటోలు చూసి ఆడియన్స్‌ షాక్‌కు గురి అవుతున్నారు.

అయితే ఈ పిక్స్‌ కేవలం సింబా చిత్రంలో స్టిల్స్‌ మాత్రమేనని.. సింబా ది ఫారెస్ట్‌ మ్యాన్‌ అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి. కాగా..  పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే అని గతంలో అనసూయ అన్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు.

ఇంకా చదవండి: వరుణ్‌ తేజ్‌ 'మట్కా' ఫస్ట్‌ లుక్‌ విడుదల

# Anasuya     # Simba     # Tollywood    

trending

View More