నటులు ఎక్కడైనా నటులే కదా..  ఇందులో నార్త్ ..  సౌత్‌ భేదాలెందుకన్న ప్రియమణి!

నటులు ఎక్కడైనా నటులే కదా.. ఇందులో నార్త్ .. సౌత్‌ భేదాలెందుకన్న ప్రియమణి!

3 months ago | 19 Views

సౌత్‌ ఇండస్టీ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే చర్చ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికే పలువురు తారలు ఈవిషయంపై స్పందించారు. తాజాగా నటి ప్రియమణి ఈ అంశంపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారు. సౌత్‌ ఇండియాకు సంబంధించిన పాత్ర కాబట్టి మీకు అవకాశమిస్తు న్నామని కొందరు బాలీవుడ్‌ దర్శకులు అంటుంటారు. త్వరలోనే ఈ ధోరణిలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నా. మేము ఇక్కడి వాళ్లమే అయినా..


హిందీ భాషను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా రంగు నార్త్‌ వాళ్లంత ఫెయిర్‌గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయమేమీ కాదు. సౌత్‌ నుంచి వచ్చే నటీనటులకు అన్ని భాషలపైనా అవగాహన ఉంటుంది. డైలాగులు చెప్పేటప్పుడు గ్లామర్‌ తప్పులు ఉన్నా.. భావోద్వేగాలను సరిగ్గా పండిస్తాం. అయినా..

నార్త్‌, సౌత్‌ అని వ్యత్యాసం చూడకూడదు. అందరూ భారతీయ నటీనటులే’ అని అన్నారు.  ప్రియమణి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయ్యారు. గతేడాది రెండు సూపర్‌ హిట్లు అందుకున్న ఆమె ప్రస్తుతం 'మైదాన్‌’ కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా అమిత్‌శర్మ దీనిని తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: మీ సినిమా హిట్ కొట్టడం ఖాయం.. పార్టీ ఇవ్వాల్సిందేననన్న రష్మిక మందన్నా!!

# Priyamani     # Bollywood     # Socialmedia